సాక్షి, విశాఖపట్నం: ‘సాక్షి’ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని కేపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో చేపట్టిన ‘హోదా కోసం ఎందాకైనా’ సదస్సు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా చేపట్టిన ఈ సదస్సులో వివిధ పార్టీల ప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంజీవనే అని ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేయనుండటం హర్షణీయమని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment