
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా ఆధ్వర్యంలో త్వరలో బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో టీడీపీ నాయకత్వ లోపంతోనే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పథకాలకు ఆకర్షితులై ప్రజా పాలన కోసం బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని, జిల్లాకు చెందిన నేతలందరూ బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment