
సాక్షి, నల్గొండ : నాగార్జునసాగర్‌లో జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మైక్ విసిరేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కాంగ్రెస్ నేతలు శనివారం నాగార్జునసాగర్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించాలనే అంశంపై నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. నియోజకవర్గ ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగించాలని... కొత్తవాళ్లకు బాధ్యతలు ఇస్తే వారికి ఏం తెలుస్తుందని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవని నేతలకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే దానిపై వారికి అవగాహన ఉండదంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైక్‌ను వేదికపైకి విసిరికొట‍్టి సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment