సాక్షి, కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతిలో కురుకుపోయారని.. ఆయనపై కేసులు వేస్తే విచారణకు కోర్టులకు సమయం చాలదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి కొన్ని పథకాల అమలులో అవార్డులు వస్తున్నాయని.. అమృత పథకంలో ఏపీకీ అవార్డు రావడానికి కేంద్రం ఇచ్చినా నిధులే కారణమని అన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులతోని అవార్డులు వస్తుంటే.. నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రకృతి వ్యవసాయాన్ని పాలేకర్ కనిపెట్టారని గుర్తుచేశారు. అలాంటిది ఐకరాజ్య సమితిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు చంద్రబాబును ఆహ్వానించారని అంటున్నారని.. పాలేకర్ కన్నా చంద్రబాబు ముందు పుట్టారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారో అర్ధం కావడం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment