
అమరావతి: యువనేస్తం పథకం ప్రారంభసభలో విద్యార్థులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు ఖంగుతిన్నారు. ఈ పథకం ఎన్నికల కోసమే పెట్టారా..ఎన్నికలు ముగియగానే ఈ పథకాన్ని మూసేస్తారా అని విద్యార్థులు ప్రశ్నించారు. శ్రీసిటీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు..స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వటానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా అని సూటిగా విద్యార్థులు అడిగారు.
మీరు కూడా ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకుని ముఖ్యమంత్రి అయ్యారు..ఇప్పుడు ప్రభుత్వ యూనివర్సిటీలను ఎందుకు ప్రోత్సహించడం లేదు..ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వ యూనివర్సిటీలు మూతపడే అవకాశం ఉందని సీఎంను విద్యార్థులు నిలదీశారు. నాలెడ్జ్ కోసమే ప్రైవేటు యూనివర్సిటీలకు అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముఖ్యమా..ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యమా అని విద్యార్థులు ప్రశ్నించగా..చంద్రబాబు మళ్లీ పాతపాటే పాడారు. ఉర్దూ స్కూళ్లకి పీఈటీలను నియమించాలని ఓ యువకుడు ప్రశ్నించగా డబ్బుల్లేవని బాబు సమాధానం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment