సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు తదితరులు
కంటోన్మెంట్: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన మంగళవారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగనుంది. సభా ప్రాంగణాన్ని మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, ప్రభాక ర్, స్టీఫెన్‌సన్, సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ పరీదుద్దీన్ తదితరులు సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... బుధవారం మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో కేటీఆర్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తారన్నారు. కేటీఆర్ నాయకత్వంలో 2015లో కంటోన్మెంట్ ఎన్నికల్లో ప్రారంభమైన జైత్రయాత్ర 2016లో జీహెచ్‌ఎంసీ, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 16 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, బోర్డు సభ్యుడు పాండుయాదవ్, పవన్‌కుమార్ గౌడ్, అత్తెల్లి శ్రీనివాస్‌గౌడ్, నరేందర్‌రావు, ఆకుల హరికృష్ణ, బాలరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment