
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదని విమర్శించారు.
పవన్ నియమించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నాయకులు ఉన్నారని, వారు బీజేపీ చెప్పింది వింటారు కానీ పవన్ మాట వినరని ఆయన అన్నారు. గతంలో ప్రజారాజ్యంపార్టీ స్థాపించిన చిరంజీవి కొన్ని సీట్లు అయినా సాధించగలిగారని, కానీ పవన్ మాత్రం అంతకుముందే దుకాణం సర్దేస్తారని ఎద్దేవా చేశారు.