సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హక్కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ పిల్లిమొగ్గలు వేస్తున్నారు. కేంద్రం మోసాన్ని గర్హిస్తూ వైఎస్సార్‌సీపీ పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతుపై తోకముడిచారు. హోదా పోరులో కలిసి వస్తామని, వైఎస్సార్‌సీపీ తీర్మానానికి మద్దతు ఇస్తామని రాత్రిదాకా పేర్కొన్న ఆయన.. శుక్రవారం ఉదయానికి మళ్లీ ఉల్టాపల్టా అయ్యారు. టీడీపీనే సొంతగా అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. దానితోపాటు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలుగుతున్నదని, ఈ మేరకు బీజేపీ చీఫ్ అమిత్ షాకు బాబు లేఖరాశారని ప్రచారం జరుగుతోంది.
మద్దతుపై పెద్ద ఎత్తున ప్రచారం : ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ ఇదివరకు లోక్‌సభ సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పలు రాజకీయ పక్షాలను కలిసి మద్దతు కోరిన దరిమిలా.. శుక్రవారమే అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశంఉంది. ఈ కీలక తరుణంలో టీడీపీ కూడా కలిసి వైఎస్సీర్‌సీపీ వెంట కలిసివెళతారని జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే నేడు మాత్రం అందుకు విరుద్ధంగా సొంత తీర్మానం రాగమందుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారని, సమాంతరంగా పొలిట్‌బ్యూరో సమావేశాన్ని కూడా నిర్వహించారని, అంతా కలిసి చివరికి సొంత తీర్మానానికే జై కొట్టారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment