‘టీడీపీ ఎంపీలు డ్రామాలాడారు’ | TDP Played Drama in Rajyasabha Says Vijaya Sai Reddy | Sakshi
Sakshi News home page

‘టీడీపీ ఎంపీలు డ్రామాలాడారు’

Published Wed, Feb 7 2018 7:12 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

TDP Played Drama in Rajyasabha Says Vijaya Sai Reddy - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభలో డ్రామాలాడారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీలు చైర్మన్‌ అనుమతి తీసుకుని కేవలం ఐదే నిమిషాలు ప్లకార్డులను ప్రదర్శించడం దారుణమని అన్నారు.

ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన సంతృప్తినిచ్చిందని సభ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు, టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని అన్నారు.

తెలుగుదేశం పార్టీకి  చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో సవరణలు ప్రతిపాదించేవారని చెప్పారు. టీడీపీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టకపోయినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement