బీజేపీ నాయకుడు రమేష్ నాయుడు(పాత చిత్రం)
అమరావతి: రిజర్వేషన్లని సాకుగా చూపి ఎన్నికలు పెట్టకపోవడం చాలా దారుణమని, ఎన్నికలు పెడితే టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటిమ్ మెంబర్ రమేష్ నాయుడు జోస్యం చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయించిందని విమర్శించారు.
స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. పంచాయితీల్లో స్పెషల్ ఆఫీసర్లకు అధికారం ఇస్తే అభివృద్ధి ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. గ్రామ సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని వెల్లడించారు. చంద్రబాబు స్థానిక సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment