‘నేను ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకోలేదు’ | Telangana Congress Candidate List Will Announce 12th or 13th November | Sakshi
Sakshi News home page

‘ఈ నెల 12లేదా 13న కాంగ్రెస్‌ జాబితా’

Published Sat, Nov 10 2018 6:20 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Telangana Congress Candidate List Will Announce 12th or 13th November - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు కోసం తాను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్‌ అన్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ బీసీ నేతలను బుజ్జగించేందుకు శనివారం ఆయన తెలంగాణ భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా భక్త చరణ్‌ దాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకుంటున్నారన్న ఆరోపణలలో నిజం లేదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని మండిపడ్డారు.

డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు చేస్తున్న వారి స్థాయి ఎంటి? ఏ స్తాయిలో ఉండి తనపై ఆరోపణలు చేస్తున్నారో మీడియా తెలుసుకోవాలన్నారు. డబ్బు ఇస్తున్నామని చెబుతున్నవారికి అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. ఐటీ, ఈడీ సంస్థలతో విచారణ జరిపిస్తే నిజాలు తెలుస్తాయన్నారు. కాంగ్రెస్‌ ప్రజాస్వామిక పార్టీ అని, అన్ని వర్గాల వారికి తప్పకుండా న్యాయం చేస్తుందన్నారు. బీసీలకు కనీసం 25 సీట్లు ఇచ్చేలా జాబితా తయారు చేశామన్నారు. ఈ నెల 12 లేదా 13న కాంగ్రెస్‌ జాబితాను ప్రకటిస్తామని భక్తచరణ్‌ దాస్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement