
సాక్షి, మేడ్చల్ జిల్లా: లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేయటానికి ఈ నెల 25 వరకు గడువు ఉన్నప్పటికీ, ఇందులో మూడు సాధారణ సెలవురోజులు ఉన్నాయి. ఈ సాధారణ సెలవు రోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండదు. 21న హోలీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం కావటంతో ఈ మూడు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండదనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలని అధికారులు సూచించారు.