![TPCC Working President Revanth Reddy Chit Chat Over Lok Sabha Elections - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/13/Revanth-Reddy.jpg.webp?itok=QAe2iyxm)
సాక్షి, హైదరాబాద్ : కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ ఆదేశాలను కాదని మరింత ఇబ్బందులకు గురిచేయనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచి పోటీ చేయడానికైనా సిద్ధం. లీడర్‌గా తప్పదు. గెలిచినా ఓడినా.. కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సింది ముఖ్యనేతలే’ అని అన్నారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ.. మరో మూడు నెలల అనంతరం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఘోర పరాజయం చవిచూసిందని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ ఓ గచ్చిబౌలీ దివాకర్. కాంగ్రెస్ టెండూల్కర్ వంటి దిగ్గజమైన పార్టీ. సంప్రదాయాల పేరుతో టీఆర్‌ఎస్ కాంగ్రెస్ మద్దతు తీసుకుంటది. మరి కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉన్నా కేసీఆర్ ఎలా అయిదో ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టారు’ అని ప్రశ్నించారు.
(రేవంత్ రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు)
Comments
Please login to add a commentAdd a comment