
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న భట్టి, డీకే అరుణ, రేవంత్,శ్రీధర్,ఇతర నాయకులు
సాక్షి, హైదరాబాద్: తమ వ్యక్తిగత అజెంగా కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. నీతిఆయోగ్ సమావేశంలో కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయారని విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను సాధించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.
ప్రాణహిత చేవెళ్లను జాతీయ ప్రాజెక్టు చేయమని కోరక, కాళేశ్వరం ప్రాజెక్టుకు 20వేల కోట్లు కేటాయింమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. గిరిజన యూనివర్సీటీ, హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీలాంటి అనేక హామీలను సాధించడంలో కేసీఆర్ విఫలం అయ్యారని వ్యాఖ్యానించారు.
థర్డ్ ఫ్రంట్ అని చెప్పి బీజేపీ, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను కలుస్తానన్న కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో భట్టివిక్రమార్కతో పాటు డీకే అరుణ, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment