
సాక్షి, మెదక్ : తమ పంచాయితీ తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య కాదని, తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించే వలసాంధ్ర నాయకత్వం పైనని ఆపద్దర్మ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం మెదక్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పల్లకి మోసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఎపి భవన్‌లో చంద్ర బాబు నాయుడు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు కట్టుకుని నిలబడటాన్నితెలంగాణ ప్రజలు సహింలేరన్నారు.
తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల లేఖలను త్వరలో బయటపెడతామన్నారు. ఆ లేఖల్లో చంద్రబాబుపై అమరులు ఏం రాశారో ప్రజలకు వివరిస్తామమని హరీశ్ తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులను వద్దంటున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో పదేళ్లలో 5లక్షల ఎకరాలకు నీరందిస్తే... నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం 12 లక్షల ఎకరాలకు నీరు అందించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment