
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, చేర్పులు, తొలగింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
సోమవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ఎన్నికల సమన్వయ సంఘం చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రభుత్వం కుట్ర పూరితంగా లక్షలాది మంది ఓట్లను తొలగిస్తోందని, తమకు అనుకూలంగా ఉండే అనర్హులను కూడా చేరుస్తోందని ఆరోపించారు.
స్థానికంగా ఉండే కాంగ్రెస్ శ్రేణులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ఓటర్ల తుదిజాబితా తయారయ్యేలా చూడాలని కోరారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వారంలో పంచాయతీ సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు, పార్టీ అధికార ప్రతినిధులు నిరంజన్, శ్యాంమోహన్, ప్రధాన కార్యదర్శి ప్రేమలతా అగర్వాల్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment