
వాసుపల్లి కార్యాలయం ముందు బైఠాయించిన మహిళలు
సాక్షి, విశాఖ సిటీ: అందరికీ డబ్బులు పంచారు. మా వార్డులో మాత్రం స్థానిక నేతలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మాకు కూడా వెంటనే డబ్బులు పంచాల్సిందేనంటూ.. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్ కార్యాలయం ఎదుట కొందరు మహిళలు బైఠాయించారు. 20వ వార్డు రామజోగిపేటకు చెందిన కొందరు మహిళలు జీవీఎంసీ జోన్ – 2 కార్యాలయం సమీపంలో ఉన్న వాసుపల్లి కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం బైఠాయించారు. టీడీపీ నేతలు ఓటు వెయ్యాలంటూ డబ్బులు పంచారని, తమ 20వ వార్డులో మాత్రం డబ్బులు ఇవ్వలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. వీరి వ్యాఖ్యలు చుట్టు పక్కల ఉన్న ప్రజలకు విస్మయానికి గురి చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment