
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని టీడీపీ నిర్వహించే మహానాడులో ప్రతి సంవత్సరం ఎన్టీఆర్‌కు భారతరత్న పేరుతో ఆటపట్టించడంపై విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'బతికున్నోళ్లను మభ్యపెట్టడానికి పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించడం చూస్తుంటాం. 25 ఏళ్ళ క్రితం మరణించిన ఎన్టీఆర్‌ను భారతరత్న పేరుతో ఆటపట్టించడం ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమే. ప్రతి ఏటా తీర్మానం చేస్తారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: కరోనా ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం
కాగా మరో ట్వీట్‌లో.. కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా... అనే విషయంపై ఎవరైనా మాస్టర్ డిగ్రీ/ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఆన్ లైన్ కోర్సులు జూమ్ యాప్ ద్వారా చేయాలనుకుంటే.. మన నెగటివ్ థింకింగ్ పితామహ గడ్డం బాబుని సంప్రదించవచ్చు' అంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే