
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో.. 'తాను ట్వీట్ చేస్తే వైఎస్సార్‌సీపీ వణికి పోతుందన్నాడు చిట్టినాయుడు. జనం మాత్రం టిక్ టాక్ లేని లోటు తీరుస్తున్నాడంటున్నారు. తిండి ఖర్చుల గురించి ఆయన మాటలు విని నవ్వుకుంటున్నారు. ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు. అన్నట్లు కొల్లును పరామర్శించావా ? మర్చిపోయావా చిట్టి!' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: మాలోకం చిన్న మెదడు చితికినట్లుంది
కాగా మరో ట్వీట్‌లో.. పేదలందరికీ ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో టీడీపీ చేస్త్నున్న కుటిల ప్రయత్నాలను ఆపాలని హితువు పలికారు. 'ఇల్లులేని కుటుంబం ఆంధ్రాలో ఉండకూడదన్నదే జగన్ గారి ఆలోచన. పేదలకిచ్చే 30 లక్షల ఇళ్ల స్థలాల విషయంలో సంకుచిత ఆలోచనలు ఆపండి. ఒకసారి ఎక్కువ రేటుకు కొన్నారంటారు. మరోసారి ఊరు చివర అంటారు. అబద్ధపు ప్రచారాలతో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం పచ్చనేతలు' అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.
చదవండి: దొంగే దొంగా.. దొంగా అంటున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment