సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో కూర్చొని రాజకీయాలు చేయడం మానేస్తే బాగుంటుందంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్విటర్ వేదికగా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు కురిపించారు. 'రోజుకు రెండు గంటలు మైకు ముందు ఉపన్యాసం దంచాలి. వీడియో కెమెరాలు రికార్డు చేసేటప్పుడు వెలిగే రెడ్ లైట్ కనిపించాలి. లేకపోతే ముద్ద దిగదు. మనవడితో కాసేపు ఆడుకుని, ఎల్లో ఛానల్స్ లో తన బొమ్మలను చూసుకున్నాకే నిద్రపోతాడు. ప్రజల గురించి ఆందోళన, కార్యకర్తలకు దిశానిర్ధేశం అంతా ఫేకుడే' అంటూ మండిపడ్డారు.
(తుప్పు, పప్పు.. 150 మంది సెక్యూరిటీ అవసరమా?)
కాగా మరో ట్వీట్‌లో 'మళ్లీ ఛాన్స్ రాదన్నట్టు ఐదేళ్లలో బాబు వనరులన్నిటిని దోచుకున్నాడు. అప్పులపాలు చేసి పదేళ్లు వెనక్కు నెట్టి వెళ్లాడు. సిఎం జగన్ పట్టుదల, క్లిష్ట సమయంలో కనబర్చిన పాలనాదక్షత రాష్ట్రాన్ని కోలుకునేలా చేసింది. ఏడాది నిండకముందే ప్రజలు కోరుకున్న సంక్షేమ రాజ్యం వచ్చింది' అంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment