సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'ఉద్యోగుల కష్టార్జితానికి చంద్రబాబు కన్నమేశారని కాగ్ తేల్చింది. 731 కోట్ల రూపాయల సీపీఎస్ డబ్బును బ్యాంకుకు జమ చేయలేదు. ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం కొట్టేశాడు. ప్రత్యేక విమానాలకు - దొంగ దీక్షలకు దుబారా చేశాడు బాబు గారు' అంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
కాగా మరో ట్వీట్‌లో.. 'రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనంటూ కళా వెంకట్రావు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తోందని మరో పచ్చనేత. క్రిమినల్స్ రాజ్యసభకు వెళ్తున్నారంటూ సభా మర్యాదకు భంగం కలిగేలా ప్రేలాపన. ఇలా దిగజారి మాట్లాడే బదులు ఆత్మ విమర్శ చేసుకోండి. మీ ఎమ్మెల్యేలే ఛీకొట్టి మీకు ఓటేయలేదని గ్రహించండి!' టీడీపీ నాయకులకు విజయసాయి రెడ్డి చురకలంటించారు. చదవండి: 'కొడుకు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు'
Comments
Please login to add a commentAdd a comment