సాక్షి, విశాఖపట్నం : కరోనావైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తుంటే.. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయినా తానే ముఖ్యమంత్రిని అనుకుని చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారని మండిపడ్డారు.
(చదవండి : ‘బాబూ! మీ ఏడుపు ఆగదు.. బుద్ధి మారదు’)
తన సలహాలతోనే మోదీ నడుచుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జూమ్ యాప్‌లో తీసేసిన తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు ఆదేశాలతో విశాఖపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమగ్ర కుటంబ సర్వే నిర్వహించి.. దాని ద్వారా ప్రజల ఆరోగ్య పరిస్థితలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటన్నామని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ రూ.20 కోట్లకు అమ్ముడుపోయి ప్రభుత్వంపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment