అందుకే నర‍్సాపురం వచ్చా: నాగబాబు | We will contest Local Body elections alone, says Nagababu | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: నాగబాబు

Published Fri, Jul 26 2019 4:36 PM | Last Updated on Fri, Jul 26 2019 5:46 PM

We will contest Local Body elections alone, says Nagababu - Sakshi

సాక్షి, నర‍్సాపురం : కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే తాను నర‍్సాపురం వచ్చానని జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా నర‍్సాపురంలో పర్యటించారరు. అనంతరం నాగబాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని నాగస్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, అందుకే బాగా పరిపాలించాలని నాగబాబు అన్నారు. కొన్నిచోట్ల జనసేన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్న ఆయన.. పోలీసులు అధికారంలో ఉన్నవారికి సపోర్టు చేయొచ్చుగానీ, తప్పుడు కేసులు పెట్టకూడదని అన్నారు. కాగా నాగబాబు ఇటీవల జరిగిన సార్వత‍్రిక ఎన్నికల్లో జనసేన తరపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement