సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విపక్ష కాంగ్రెస్ పలు ఆరోపణలు చేయగా.. తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ స్పందించారు. గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటు పలువురు న్యాయమూర్తులు సైతం దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆయనపై వస్తున్న ఆరోపణలు రంజన్ గొగోయ్ స్పందించారు. (మోదీ అనుకూల తీర్పులు.. అందుకే రాజ్యసభకు)
తాను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం.. వీటన్నింటికి సమాధానం చెబుతానని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడాన్ని తాను స్వాగతించడం వెనుక ఉన్న బలమైన కారణం కూడా వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా కేంద్రలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారమే విమర్శలూ వినిస్తున్నాయి. అయోధ్య భూ వివాదం, రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన ధర్మాసనానికి జస్టిస్ గొగొయే నేతృత్వం వివహంచిన విషయం తెలిసిందే. (రాజ్యసభకు మాజీ సీజేఐ)
Comments
Please login to add a commentAdd a comment