Ranjan gagoy
-
‘బీజేపీ సీఎం అభ్యర్ధిని కాదు’
గువహతి : వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ సాగుతున్న ప్రచారాన్ని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తోసిపుచ్చారు. ‘నేను రాజకీయ నేతను కాదు..నాకు అలాంటి కోరిక లేద’ని రాజ్యసభ సభ్యులు గగోయ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది రాజ్యసభ సభ్యత్వాన్ని తాను ఆమోదించడం రాజకీయాల్లో లాంఛనంగా ప్రవేశించే దిశగా తీసుకున్న నిర్ణయం కాదని ఇండియాటుడేతో మాట్లాడుతూ పేర్కొన్నారు. రాజ్యసభకు తాను నామినేటెడ్ సభ్యుడనని, రాజకీయపార్టీకి చెందిన అభ్యర్థిగా తాను నామినేట్ కాలేదన్న విషయం ప్రజలు గుర్తెరగాలన్నారు. తనకు ఆసక్తి ఉన్న అంశాలపై స్వతంత్రంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడిగా తాను ఉండాలనుకున్నానని, అలా ఉండటం తనను రాజకీయ నేతగా చేసిందా అని ఆయన ప్రశ్నించారు. కాగా వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో రంజన్ గగోయ్ బీజేపీ సీఎం అభ్యర్థి కావచ్చని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత తరుణ్ గగోయ్ వ్యాఖ్యానించారు. రామమందిర తీర్పుపై సంతోషంతో ఉన్న బీజేపీ రంజన్ గగోయ్‌కు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసిందని, ఆయన ఈ పదవిని ఆమోదించడం చూస్తుంటే ఆయన క్రియాశీలక రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నారని తెలుస్తోందని తరుణ్ గగోయ్ వ్యాఖ్యానించారు. మరోవైపు తరుణ్ గగోయ్ వ్యాఖ్యలను అస్సాం బీజేపీ విభాగం సైతం అర్ధరహితమని పేర్కొంది. చదవండి : అక్షయ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపిన అస్సాం సీఎం -
విమర్శల వెల్లువ: అన్నింటికీ బదులిస్తా
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విపక్ష కాంగ్రెస్ పలు ఆరోపణలు చేయగా.. తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ స్పందించారు. గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటు పలువురు న్యాయమూర్తులు సైతం దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆయనపై వస్తున్న ఆరోపణలు రంజన్ గొగోయ్ స్పందించారు. (మోదీ అనుకూల తీర్పులు.. అందుకే రాజ్యసభకు) తాను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం.. వీటన్నింటికి సమాధానం చెబుతానని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడాన్ని తాను స్వాగతించడం వెనుక ఉన్న బలమైన కారణం కూడా వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా కేంద్రలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారమే విమర్శలూ వినిస్తున్నాయి. అయోధ్య భూ వివాదం, రాఫెల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన ధర్మాసనానికి జస్టిస్ గొగొయే నేతృత్వం వివహంచిన విషయం తెలిసిందే. (రాజ్యసభకు మాజీ సీజేఐ) -
మోదీ అనుకూల తీర్పులు.. అందుకే రాజ్యసభకు
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేయడంపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకు గొగోయ్‌ను పెద్దల సంభకు పంపారని విమర్శలు గుప్పిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పలు వ్యాఖ్యలు చేశారు. ‘నాకు మీ రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం తీసుకువస్తాను.. అని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గతంలో పిలుపునిచ్చారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం.. మాకు అనుకూలంగా తీర్పులు ఇవ్వండి. మీకు ఉన్నత పదవులు కట్టబెడతాను అని న్యాయవ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారు. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తోంది’ అని ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (రాజ్యసభకు మాజీ సీజేఐ) బీజేపీ సిద్దాంతాలకు లోబడి తీర్పులు ఇచ్చినందుకు గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారని అభిషేక్ మను సింఘ్వీ అభిప్రాయపడ్డారు. కాగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి రిటైర్మెంట్తో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ గొగోయ్‌ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ న్యాయవాద వృత్తిలో గొగోయ్ అనేక సార్లు వార్తలు నిలిచారు. గత ఏడాది నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించి చరిత్రలో నిలిచిపోయారు. (రాఫెల్‌పై మోదీ సర్కారుకు క్లీన్చిట్) రఫేల్ ఫైటర్ జెట్స్ కేసును, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును కూడా ఆయన విచారించారు. అయోధ్య కేసులో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని ఆయన తీర్పునిచ్చారు. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. సీజేఐగా పదవీకాలంలో లైంగిక వేధింపుల ఆరోపణ సహా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. రఫేల్ ఫైటర్ జెట్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన ధర్మాసనానికి కూడా జస్టిస్ గొగొయే నేతృత్వం వహించారు. -
రవిప్రకాశ్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు
సాక్షి, అమరావతి: టీవీ9 మాజీ సీఈవో వెలిచేటి రవిప్రకాశ్ అలియాస్ రవిబాబు రూ.వందల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, విదేశాల్లో పెద్దఎత్తున నల్లధనాన్ని దాచిపెట్టడంతో పాటు భారీ మొత్తంలో విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐ) ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌కి తాజాగా లేఖ రాశారు. రవిప్రకాశ్, ఆయన భార్య దేవిక, ఇతరుల అక్రమార్జన, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను కూడా జతచేసి సీజేఐకి పంపించారు. అడ్డగోలు సంపాదన ‘‘ఎలక్ట్రానిక్ మీడియా వ్యాపారంలో ఉన్న రవిప్రకాశ్ తన పదవిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బు, ఆస్తులను సంపాదించారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టారు. ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం(వీఎంఎల్ఏ), ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ చట్టం(ఫెమా), ఆర్బీఐ నిబంధనలు, ఆదాయపు పన్ను చట్టంతో పాటు ఇతర చట్ట నిబంధనలకు విరుద్ధం. సానా సతీష్‌బాబుకు రవిప్రకాశ్ అత్యంత సన్నిహితుడు. సానా సతీష్, మొయిన్ ఖురేషీతో కలిసి బ్యాంకులను, ఎంఎంటీసీలను మోసం చేశారు. సానా సతీష్‌ను సీబీఐ, ఈడీలు ఇప్పటికే విచారిస్తున్నాయి. వీరంతా కూడా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి ఆ డబ్బును హవాలా మార్గంలో దేశం దాటించారు. ముసద్దీలాల్ జ్యువెలర్స్‌కు చెందిన సుకేష్ గుప్తాతో కలిసి వీరంతా కూడా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహించారు. ఇలా ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. అంతేకాక ఈ విధంగా సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు. రవిప్రకాశ్‌కు పలు దేశాల్లో పలు రకాల చిరునామాలు, బ్యాంకు ఖాతాలున్నాయి. రవిప్రకాశ్, అతని భార్య దేవిక మీడియా ఎన్ఎక్స్టీ లిమిటెడ్‌లో చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇండో జాంబియా బ్యాంక్‌లో ఖాతా కూడా ఉంది. ఈ వివరాలను కూడా వీరు బహిర్గతం చేయలేదు. జాతి ప్రయోజనాలను ఆశించి ఈ ఫిర్యాదు చేస్తున్నా. ఈ ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రవిప్రకాశ్, అతని భార్య దేవిక, ఇతర సహాయకుల అక్రమాలు, అక్రమార్జనపై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’’ అని తన లేఖలో కోరారు. -
‘అయోధ్య' కోసం మరో గంట కూర్చుంటాం’
న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ అక్టోబర్ 18లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణను గడువులోపు పూర్తి చేసేందుకు మరో గంట ఎక్కువ పని చేస్తామని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. 'ఈ సోమవారం (సెప్టెంబరు 23) నుంచి మరో గంట సేపు కూర్చుంటాం. రోజూవారి వాదనల సమయాన్ని సాయంత్రం 4గంటల నుంచి 5గంటలకు పెంచుతున్నామని' సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. కాగా అయోధ్య విచారణలో పాల్గొనే బెంచ్‌లో జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు ఎస్ఎ బాబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషన్, ఎస్ఎ నజీర్‌లు ఉన్నారు. అయోధ్య పరిష్కారం కోసం ఆగస్టు 6 వతేది నుంచి రాజ్యాంగ ధర్మాసనం రోజువారి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను అక్టోబరు 18లోగా ముగించాలని ఇటీవలే న్యాయస్థానం నిర్ణయించింది. సుప్రీంకోర్టు పెంచిన గంట సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే 'అయోధ్య' తీర్పు వీలైనంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. (చదవండి :అయోధ్య వాదనలు 18కల్లా ముగించండి) -
ఆ శక్తులపై విజయం సాధిస్తాం
గువాహటి: భారత్‌లో కొందరు వ్యక్తులు, కొన్ని బృందాలు గొడవపడే ధోరణితో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇలాంటి శక్తులపై దేశంలోని రాజ్యాంగ సంస్థలు పైచేయి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. అస్సాంలోని గువాహటిలో ఆదివారం హైకోర్టు ఆడిటోరియానికి శంకుస్థాపన చేసిన అనంతరం జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ..‘ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు, గ్రూపులు జగడాలమారితనంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు కొన్ని మినహాయింపులు మాత్రమే. మన న్యాయవ్యవస్థకున్న బలమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు అన్నివర్గాలకు సాయం చేస్తాయి. జడ్జీలు, న్యాయాధికారులు ఎల్లప్పుడూ ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్లే న్యాయవ్యవస్థ మనుగడ సాగిస్తోంది’ అని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్లకు మించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు వెయ్యికిపైగా ఉన్నాయని జస్టిస్ గొగోయ్ తెలిపారు. అలాగే 25 ఏళ్లకు మించి పెండింగ్‌లో ఉన్నవి 2 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల విచారణను సత్వరం పూర్తిచేయాలని జడ్జీలను కోరారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 90 లక్షల సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 20 లక్షల కేసుల్లో(23 శాతం) సమన్లు కూడా జారీ కాలేదన్నారు. జడ్జీల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న తన ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
సీజేఐపై ఆరోపణలు : విచారణకు సుప్రీం కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్‌పై లోతైన విచారణకు సుప్రీం కోర్టు మొగ్గుచూపింది. సీజేఐపై ఆరోపణల వ్యవహారంపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్‌కు వ్యతిరేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి,ఆయన ప్రతిష్టను మసకబార్చేందుకు సహకరించాలని తనకు రూ 1.5 కోట్లు ఆఫర్ చేశారని న్యాయవాది ఉత్సవ్ బైన్స్ తన అఫిడవిట్లో కోర్టుకు నివేదించారు. పేరుప్రతిష్టలు, డబ్బు, హోదా కలిగిన వ్యక్తులు వ్యవస్ధను నడిపించాలని ప్రయత్నిస్తున్నారని, వీరి ఆటలు సాగవని మనం చాటిచెప్పాల్సిన అవసరం నెలకొందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ సీజేఐ రంజన్ గగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్వతంత్ర కమిటీని నియమిస్తూ స్పష్టం చేసింది. కాగా, ఈ విచారణ ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై చేపట్టిన అంతర్గత విచారణపై ప్రభావం చూపబోదని కోర్టు పేర్కొంది. -
ఎలక్టోరల్ బాండ్లపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకం అమలుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్లపై లోతుగా విచారించాల్సిన అవసరముందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో మరో పిటిషన్ దాఖలు చేయాలని ఎన్జీవో సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)కు సూచించింది. ఏడీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు నిధులు అందుతున్నాయని తెలిపారు. ఈ నిధుల్లో 95 శాతం అధికార పార్టీకే దక్కాయని గుర్తుచేశారు. నిధులపై పారదర్శకత లోపించిన నేపథ్యంలో ఈసీ కూడా దీన్ని వ్యతిరేకించిందన్నారు. ఈ వాదనల్ని ఖండించిన అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్.. నల్లధనాన్ని నియంత్రించేందుకే ఈ బాండ్లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. -
కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం నేడే
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్.. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఖన్నాలతో ప్రమాణం చేయించనున్నట్లు గురువారం ఒక అధికార ప్రకటన వెలువడింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్ఏ బాంబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన కొలీజియం ఈ నెల 10వ తేదీన ఈ ఇద్దరు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
10న ‘అయోధ్య’ విచారణ తేదీ ఖరారు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసుల విచారణ తేదీని తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం ఈ నెల 10వ తేదీన నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. వివిధ పక్షాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాజీవ్ ధన్వాన్ తమ వాదనలు వినిపించకుండానే కేవలం 30 సెకన్లలోనే ధర్మాసనం ఈ నిర్ణయం వెలువరించింది. -
‘న్యాయ’ స్వతంత్రత అత్యున్నతం!
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ స్వతంత్రత అత్యున్నతంగా ఉందని, భవిష్యత్తులోనూ అలాగే కొనసాగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం జడ్జీల మధ్య సహకారపూరిత వాతావరణం నెలకొందని చెప్పారు. మంగళవారం పదవీ విరమణ చేయబోతున్న ఆయన గౌరవార్థం సోమవారం కోర్టు ప్రాంగంణంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ ప్రపంచంలోనే మన న్యాయ వ్యవస్థ అత్యంత పటిష్టమైనది, దృఢమైనదన్నారు. ‘ఒకరి అభిప్రాయాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ పలానా వైపునకు మొగ్గుచూపదు. నిష్పాక్షికతకు సూచికగా న్యాయ దేవత కళ్లకు గంతలు కడతాం. చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా అన్ని కేసులను ఒకేలా చూస్తాం. ఎల్లప్పుడూ తీర్పు మానవీయ కోణంలో ఉండాలి. ఒక్కొక్కరి చరిత్ర ఒక్కోలా ఉంటుంది. వ్యక్తుల నేపథ్యాలు కాకుండా వారి కార్యకలాపాలు, ఆలోచనారీతుల ఆధారంగానే తీర్పులిచ్చాను’ అని అన్నారు. అంతకుముందు, కాబోయే సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ.. పౌర హక్కుల పరిరక్షణలో జస్టిస్ దీపక్ మిశ్రా ఎంతో సహకారం అందించారని ప్రశంసించారు. ఆధార్, స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలపై ఇటీవల ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఉదహరించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణలో విఫలమైతే, ఒకరినొకరం చంపుకుంటూ, ద్వేషించుకూంటూ ఉంటామని వ్యాఖ్యానించారు. మనం ఏం తినాలి, ఏం ధరించాలి లాంటివి వ్యక్తిగత జీవితాల్లో ప్రముఖ విషయాలుగా మారాయని అన్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ బుధవారం బాధ్యతలు చేపడతారు. సీజేఐగా చివరిసారి సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం చివరిసారిగా విధులు నిర్వర్తించారు. తదుపరి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, మరో జడ్జి ఏఎం ఖన్విల్కర్‌తో కలసి సుమారు 25 నిమిషాల పాటు కోర్టు కార్యకలాపాలు నిర్వహించారు. సోమవారం అత్యవసర కేసుల విచారణ ఉండదని, అలాంటి కేసులేవైనా ఉంటే అక్టోబర్ 3న కొత్త సీజేఐ నేతృత్వంలో చేపడతామని ఆ ముగ్గురితో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. సీజేఐగా చివరి రోజు కావడంతో జస్టిస్ దీపక్ మిశ్రా కాస్త భావోద్వేగంతో కనిపించారు. జస్టిస్ మిశ్రాకు దీర్ఘాయుష్షు కాంక్షిస్తూ, సాధారణంగా పుట్టినరోజు నాడు పాడే 1950 నాటి హిందీ సినిమాలోని పాటను పాడటానికి ఓ లాయర్ ప్రయత్నించగా వద్దని సున్నితంగా వారించారు. ఆ తరువాత కోర్టు ప్రాంగణంలో రిటైర్మెంట్ తరువాతి ప్రణాళికలు ఏమిటని ఓ జర్నలిస్టు అడగ్గా..‘జోతిష్యం సైన్స్ కాకపోయినా ప్రజలు నమ్ముతున్నారు. భవిష్యత్తు గురించి చెప్పడానికి నేను జోతిష్యుడిని కాను’ అని జస్టిస్ దీపక్ మిశ్రా బదులిచ్చారు. కొన్ని కీలక కేసులు, తీర్పులు.. ► ఆధార్ చట్టబద్ధమేనని తీర్పు ► వివాహేత సంబంధాలు నేరం కాదని, ఐపీసీ సెక్షన్ 497 కొట్టివేత ► స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంటూ సెక్షన్ 377 కొట్టివేత ► శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలందరికీ అనుమతిస్తూ తీర్పు ► ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేర చరిత్రను ఈసీకి తెలపాలంటూ ఆదేశాలు ► అయోధ్య కేసు ► ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటా ► మూక హత్యల కట్టడికి ప్రభుత్వాలకు ఆదేశాలు ► నిర్భయ గ్యాంగ్‌రేప్‌లో కేసులో దోషుల మరణశిక్షకు సమర్థన ► బీసీసీఐలో సంస్కరణలు ► ఖాప్ పంచాయతీలపై నిషేధం ► ముంబై పేలుళ్ల కేసు దోషి యాకుబ్ మెమె న్ పిటిషన్‌ను అర్ధరాత్రి దాటిన తరువాత విచారించిన బెంచ్‌కు జస్టిస్ మిశ్రా సారథ్యం.. మెమెన్ మరణశిక్షకు సమర్థన. -
కల్యాణ వెంకటేశ్వరస్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గగోయ్ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయఅధికారులు స్వాగతం పలికారు.