న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ అక్టోబర్ 18లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణను గడువులోపు పూర్తి చేసేందుకు మరో గంట ఎక్కువ పని చేస్తామని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. 'ఈ సోమవారం (సెప్టెంబరు 23) నుంచి మరో గంట సేపు కూర్చుంటాం. రోజూవారి వాదనల సమయాన్ని సాయంత్రం 4గంటల నుంచి 5గంటలకు పెంచుతున్నామని' సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. కాగా అయోధ్య విచారణలో పాల్గొనే బెంచ్‌లో జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు ఎస్‌ఎ బాబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషన్, ఎస్‌ఎ నజీర్‌లు ఉన్నారు.
అయోధ్య పరిష్కారం కోసం ఆగస్టు 6 వతేది నుంచి రాజ్యాంగ ధర్మాసనం రోజువారి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను అక్టోబరు 18లోగా ముగించాలని ఇటీవలే న్యాయస్థానం నిర్ణయించింది. సుప్రీంకోర్టు పెంచిన గంట సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే 'అయోధ్య' తీర్పు వీలైనంత తొందరగా వచ్చే అవకాశం ఉంది.
(చదవండి :అయోధ్య వాదనలు 18కల్లా ముగించండి)
Comments
Please login to add a commentAdd a comment