
వైఎస్ జగన్‌మోహన్ రైడ్డిపై జరిగిన హత్యాయత్నంపై థర్డ్ పార్టీచేత విచారణ జరిపించాలని కోరుతూ...
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రైడ్డిపై జరిగిన హత్యాయత్నంపై థర్డ్ పార్టీచేత విచారణ జరిపించాలని కోరుతూ ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. (ఆ లేఖపై సందేహాలెన్నో!)
తమ అధినేతపై కుట్ర జరుగుతుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ఇక ఈ హత్యాయత్నం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిల్‌ను మంగళవారం విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. (వైఎస్ జగన్‌పై హత్యాయత్నం; మరో కత్తి స్వాధీనం)