సాక్షి, తూర్పుగోదావరి : ‘చంద్రబాబునాయుడుపై ప్రజావ్యతిరేకత విపరీతంగా ఉండడంతో టీడీపీ డైరెక్ట్‌గా పొత్తుపెట్టుకోవడానికి రాష్ట్రంలో ఏ పార్టీ ముందుకు రావడంలేదు. చివరకు పెయిడ్ యాక్టర్, చంద్రబాబు పార్ట్‌నర్ కూడా డైరెక్ట్‌గా పొత్తు పెట్టుకోవడానికి భయపడుతున్నారు. ఇక్కడి నాయకులను ప్రజలు నమ్మడంలేదని ఢిల్లీ నుంచి తెచ్చుకుని వారితో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే నాపై 22 కేసులు పెట్టించారు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ జగన్ ఇంకా ఎమన్నారంటే..
గోదావరి పక్కనే ఉన్నా..తాగడానికి నీళ్లురావు
మండుతున్న ఎండల్లో కూడా చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరీ ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరిస్తూ..పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేవుడి దయతో, మీ అందరి దీవేనలతో 3,648 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశాను. నా పాదయాత్ర ఈ నియోజవకర్గం గుండా సాగింది. పాదయాత్రలో మీ బాధను విన్నా. మీ కష్టాలను దగ్గర ఉండి చూశా. ఇక్కడి మత్స్యకారులు నాదగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు గుర్తుకున్నాయి. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వల్ల వల్ల17 వేల మత్స్యకార కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ఒక్కొరికి రూ. 6750 చోప్పున 17నెలలు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం 6నెలల మాత్రమే చెల్లించారు. మిగిలిన 11 నెలలలో రూ.130కోట్లు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం స్సందించలేదు. ఇదే నియోజకవర్గంలో గోదావరి ఉంది కానీ తాగడానికి నీళ్లు లేవు. దాదాపు 60 గ్రామాలకు తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడ వరి పండిస్తారు. మద్దతు ధర రూ.1750 కానీ క్వింటాల్‌కు కనీసం రూ. 1250నుంచి 1300 రూపాయలు కూడా రావు. అంటే బస్తాకు రూ. 1000 రాని పరిస్థితి. పంటచేతికొచ్చే సమయానికల్లా దళారీల దోపిడి మొదలవుతుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోదు. గోదావరి ప్రవహించే ఈ నేలపై ప్రజల గొంతు తడువదు. సాగునీరు అందదు. పెట్రోలియం వనరులు ఉన్నా నిరుద్యోగుల తలరాతలు మారవు. ఈ సమస్యలు అన్ని ఆ రోజు నా పాదయాత్ర మీరు నాతో చెప్పారు. మీ అందరికి చెబుతున్నా మీ బాధలు విన్నాను. కళ్లతో చూశా. మీ అందరికి ఈ వేదికపైకి చెబుతన్నా.. నేను ఉన్నాను.
చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావు
చిన్నప్పుడు మనం కథలు వింటాం. మహాభారతం, రామాణాయం విన్నాం. రాక్షరసులు ఎలా ఉంటారో వింటాం. రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయని కథల్లో వింటాం. రావణాసురునికి 10తలలు ఉంటే ఇక్కడ మన రాష్ట్రానికి ఐదేళ్లు పాలించిన మన నారాసురునికి మాత్రం విడివిడిగా, వేరువేరుగా తలలు ఉంటాయి. చంద్రబాబుకి ఒక తల తన నెత్తిపై ఉంటుంది. ఇంకొక తల పెయిడ్ యాక్టర్, పెయిడ్ పార్ట్‌నర్ రూపంలో ఉంటుంది. ఇంకొక తల ఈనాడు దినపత్రిక, రాజ గురు రూపంలో ఉంటుంది. ఇతర ఎల్లో మీడియా, దొంగపార్టీలు, దొంగ విశ్లేషకులు రూపంలో మరో తల ఉంటుంది. వైఎస్సార్‌సీపీ మాదిరే కండువా ఉండే వారి రూపంలో ఒక తల, డిల్లీ రూపంలో ఒక తల ఉంటుంది. వీళ్లందరి లక్ష్యం ఒక్కటే చంద్రబాబు పాలనపై చర్చ జరగకూడదు. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే టీడీపీకి డిపాజిట్లు రావు. అందుకే చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారు. 2014లో బాబు ఇచ్చిన హామీలపై చర్చ జరగకూండా చేస్తున్నారు. వీళ్లే హత్యలు చేయిస్తారు. వీళ్ల పోలీసులచే విచారణ చేయిస్తారు. వీళ్ల పేపర్ల చేత వక్రీకరించి రాయిస్తారు. ఇంతటి దారుణం పాలన ఉంది. వీళ్లు రోజుకో పుకార్లు పుట్టిస్తారు. రోజుకో పొత్తులు పెట్టుకుంటారు. కానీ ఎదుటి ప్రత్యర్థి ఒక పార్టీతో పొత్తుపెట్టుకున్నారని చర్చలు జరుపుతారు. ఇదంతా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.
ప్రతి పథకంలోనూ మోసం
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమి లేదు. రైతుల రుణమాఫీ చేయలేదు. రుణాలు ఏమో కానీ కనీసం వడ్డీలు కూడా మాఫీ కాలేదు. ఇచ్చే అరకొర నిధులు కూడా ఎన్నికల రోజు వరకు పెండింగ్. ఎన్నికలకు మూడు రోజుల ముందు నిధులు వేస్తారట. ఎంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారో ఆలోచించండి. ప్రతి పథకంలోనూ, ప్రతి అడుగులోనే మోసాలు కన్పిస్తాయి. ఇదంతా ప్రజలు గమనించాలి.
నాపై 22కేసులు.. పార్ట్‌నర్‌పై జీరో కేసులు
చందబాబు పార్ట్‌నర్, పెయిడ్ యాక్టర్ గురించి చెప్పాలి. నా పార్ట్‌నర్ చాలా బాగా మాట్లాడుతున్నాడని చంద్రబాబు పొగుడుతాడు. ఇదే యాక్టర్ నామినేషన్ వేస్తారు. ఆ నామినేషన్‌లో తెలుగు దేశం జెండాలు కనిపిస్తాయి. ఇదే యాక్టర్ నాలుగేళ్ల చంద్రబాబుతో కలిసి కాపురం చేస్తాడు.. ఎన్నికలకు ఏడాది ముందు విడాకులు తీసుకున్నట్లుగా బిల్డఫ్ ఇస్తాడు. పోరాటం చేసినట్టు యాక్టింగ్ చేస్తారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ ఐదేళ్లలో నాపై 22కేసులు పెట్టారు. రాజధాని భూముల విషయంలో అక్కడి రైతులకు అండగా వెళితే 8 కేసులు, హోదా కోసం ధర్నా చేస్తే 4 కేసులు పెట్టించారు. ఇలా నాకు 22 కేసులు చంద్రబాబు బహుమతిగా ఇచ్చాడు. ఇదే చంద్రబాబు తన యాక్టర్, పార్ట్‌నర్ మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. వీళ్ల డ్రామాలు ఎలా ఉన్నాయో గమనించండి. చంద్రబాబు మీద ప్రజావ్యతిరేకత ఎలా ఉంది అంటే చివరకు తన పార్ట్‌నర్, యాక్టర్‌తో డైరెక్టుగా ముందు ఉండి పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. గొప్పపాలన చేస్తే ఇది నా అభివృద్ధి అని చెప్పి ఓట్లు అడగాలి. కానీ చంద్రబాబు అలా చేయడంలేదు. ఎందుకంటే అభివృద్ధి అనేదే చేయలేదు. ఇదే పెద్దమనిషి తో పొత్తు పెట్టుకోవడానికి భయపడుతున్నారు. ప్రజావ్యతిరేకత విపరీతంగా ఉండడంతో ఇక్కడినాయకులు వద్దని ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఫరూక్ అబ్దుల్లాను తెచ్చకొని నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఎన్నికలు దగ్గరుకు వచ్చాయి కాబట్టి ఉన్నది లేనట్లుగా చంద్రబాబు చూపిస్తారు. ప్రజలు ఇదంతా గమనించారు.
డబ్బులకు మోసపోవద్దు
ఎన్నికలు దగ్గరుకు వస్తే చంద్రబాబు రోజకో సినిమా చూపిస్తాడు. అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి.
ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్, ఎంపీ అభ్యర్థి అనురాధపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment