వంచనపై గర్జన పేరుతో వైఎస్సార్‌సీపీ ధర్నా | YSRCP Conduct Rally On Chandrababu Naidu Failures | Sakshi
Sakshi News home page

వంచనపై గర్జన పేరుతో వైఎస్సార్‌సీపీ ధర్నా

Published Wed, May 16 2018 12:01 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

YSRCP Conduct Rally On Chandrababu Naidu Failures - Sakshi

సా‍క్షి, విజయవాడ: నాలుగేళ్ళుగా ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేయటాన్ని నిరసిస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం వంచనపై గర్జన పేరుతో ధర్నా కార్యక్రమాలు నిర్వహించింది. విజయవాడలోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట వంచనపై గర్జన పేరుతో ధర్నా నిర్వహించి కలెక్టర్‌ లక్ష్మీకాంతంకి వైఎస్సార్‌సీపీ నేతలు వినతిపత్రం అందించారు. ఈ ధర్నాలో పార్టీ నేతలు పార్ధసారధి, ఎమ్మెల్యే రక్షణ నిధి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, వంగవీటి రాధా, మల్లాది విష్ణు, నాగిరెడ్డితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.

చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసాల్ని నిరసిస్తూ చిత్తూరులో జరిగిన వంచనపై గర్జన ధర్నాలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, చింతల రామచంద్రారెడ్డి, ఇన్‌ఛార్జ్‌లు జంగాలపల్లి శ్రీనివాసులు, చంద్రమౌళి, ఆడిములం, రాకేష్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పాకాల ఆశోక్‌ కుమార్‌, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, భూమా కరుణాకర్‌ రెడ్డి, పార్టీ మహిళా కన్వీనర్‌ గాయత్రి, శైలాజారెడ్డి, రైతు నాయకులు ఆదికేశవరెడ్డి, కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం: జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు చేపట్టిన వంచనపై గర్జన ధర్నాలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్నా వారిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన  కృష్ణదాస్‌, పిరియా సాయిరాజ్‌, నియోజవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌ కుమార్‌, నర్తు రామారావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ జిల్లా: కడప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ వంచనపై గర్జన పేరుతో ధర్నాను నిర్వహించింది. ఈ ధర్నాలో కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, కడప, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు సురేష్‌ బాబు, అమర్నాధ్‌ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, రఘురామిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు, ఇన్‌చార్జ్‌లు, పార్టీ శ్రేణుల పెద్ద సంఖ్యలో ఈ కార్యాక్రమంలో పాల్గొన్నారు.

నెల్లూరు: నాలుగేళ్ళుగా  ఏపీ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు చర్యలను నిరశిస్తూ వంచనపై గర్జన పేరుతో వైఎస్సార్‌సీపీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌రావు, వమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌ రెడ్డి, జెడ్‌.పి. చైర్మన​ బొమ్మిరెడ్డి రాఘవవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విశాఖ: సౌత్‌జైల్‌ రోడ్‌ ప్రభుత్వ మహిళ కళాశాల ఎదుట వంచనపై గర్జన కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ నిర్వహించింది. సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బూడిమూత్యాల నాయుడు, కంభా రవిబాబు, గుడివాడి అమర్‌ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి: కలెక్టరేట్‌ ఎదుట వంచనపై గర్జన పేరుతో వైఎస్సార్‌సీపీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు కురసాల కన్నబాబు, గ్రేటర్‌ రాజమండ్రి అధ్యక్షులు కందుల దుర్గేష్‌, కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, తోట సుబ్బారావు నాయుడు, జ్యోతుల చంటిబాబు, జక్కంపూడి రాజా, తదితరులు పాల్గొన్నారు.

కర్నూల్‌: వైఎస్సార్‌సీపీ నిర్వహించిన వంచనపై గర్జన కార్యక్రమం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన  ర్యాలీలో వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్య, సాయి ప్రసాద్‌రెడ్డి, బాలనాగా రెడ్డి, పార్లమెంట్‌ అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి, బి.వై రామయ్య, గంగుల, తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు: కలెక్టరేట్‌ ఎదురుగా వైఎస్సార్‌సీపీ నిర్వహించిన వంచనపై గర్జన  కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, లావు శ్రీ కృష్ణదేవరాయలు, కిలారి రోశయ్య, ఎమ్మెల్యేలు, ఆర్కే, పిన్నెళి, గోపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం: కలెక్టరేట్‌ కార్యాలయం ఎదురుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వంచనపై గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందుపురం పార్లమెంట్‌ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్‌ నారాయణ, పార్లమెంట్‌ సమస్వయకర్తలు పీడీ రంగయ్య, ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, నేతలు.. నవీన్‌ నిశ్చల్‌, డాక్టర్‌ సిద్ధారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తరదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement