సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో లక్షల సంఖ్యలో బోగస్ ఓట్లను సృష్టించడం చంద్రబాబుకే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షానికి అనుకూలంగా వ్యక్తుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం దారుణమని మండిపడ్డారు. చివరికీ పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టుపట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై గవర్నర్ స్పందించాలని డిమాండ్ చేశారు. విజయవాడ వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలో పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాయల ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిథున్ రెడ్డి హాజరవ్వగా.. ఎమ్మెల్యే రక్షణనిధి, నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, నాయకులు బొప్పన భవకుమార్, పుణ్యశీల, శ్రీశైలజ, అవుతు శ్రీనివాసరెడ్డి, రామిరెడ్డి, ఎంవీఆర్ చౌదరి, మనోజ్ కొఠారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార వ్యవస్థలను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందని, ఎన్నికల్లో మళ్ళీ గెలిచేందుకు చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment