
వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు(పాత చిత్రం)
విశాఖపట్నం: తెలుగు వారి అభ్యున్నతి కోసం పుట్టిన టీడీపీని నారా చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం పదవి, డబ్బు మాత్రమే చంద్రబాబుకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ పొరపాటున గెలిస్తే చంద్రబాబు కేంద్రంలో మంత్రి పదవి పొందాలని తాపత్రయపడుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి బాబు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కొనసాగించడం తగదన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని వెంటనే సీఎంగా చంద్రబాబుని తొలగించాలని డిమాండ్ చేశారు.