‘బాబు లక్ష శాతం ఓడిపోవడం ఖాయం’ | YSRCP Leader Dhadi Veerabhadra Rao Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబు లక్ష శాతం ఓడిపోవడం ఖాయం’

Published Tue, May 21 2019 3:31 PM | Last Updated on Tue, May 21 2019 6:47 PM

YSRCP Leader Dhadi Veerabhadra Rao Slams Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో లక్ష శాతం ఓడిపోవడం ఖాయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు జోస్యం చెప్పారు. మంగళవారం దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఓడిపోవడం ఖాయమని తెలిసే దేశమంతా తీర్ధయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. పిలవని పేరంటానికి చంద్రబాబు నాయుడు వెళ్లడమే కాకుండా తాను ఏదో సారించేస్తానని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అందరి దగ్గరకు వెళ్లి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement