
సాక్షి, విశాఖపట్నం: హోదాకు సమాధి కట్టిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన ఈవెంట్‌ను చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకున్నారని ఆయన అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రూ. 30 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
హోదా పేరెత్తితే అరెస్టులు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు.. ఏముఖం పెట్టుకుని దీక్ష చేశారని గుడివాడ అమర్‌నాథ్ నిలదీశారు.