
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పూటకో అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. అంతేకాక చంద్రబాబుని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎమ్మెల్యే నాని ఎద్దేవా చేశారు. ఊసరవెల్లి కంటే వేగంగా బాబు రంగులు మార్చగలడని అన్నారు. చంద్రబాబుకు హోదా అవసరం లేదు.. ప్యాకేజీ కావాలని కొడాలి నాని పేర్కొన్నారు. ఎందుకంటే ప్యాకేజీ వస్తే పందికొక్కుల్లా తినొచ్చు అనే ఆలోచనలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా ప్రపంచం అంతా నా వెంట పడుతుందని చెప్పి బాబు చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు.
చంద్రబాబు చెప్పేవని దొంగ మాటలు అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. చంద్రబాబు పెద్ద గజదొంగ అని విమర్శించారు. ధర్మపోరాటం అనే మాట మాట్లాడే అర్హత బాబుకు లేదన్నారు. ప్రస్తుతం బాబుని పీఎం నరేంద్ర మోదీ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీపీఐ, సపీఎం అందరూ తిడుతున్నారన్నారు. చంద్రబాబు, సోనియా గాంధీ కుమ్మకై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని కొడాలి నాని పేర్కొన్నారు.
ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment