సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల కమిషన్ అడ్డుపడటం వల్లే పిడుగుల్ని ఆపలేకపోయానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ....రాష్ట్రంలో ఫోని తుపాను వస్తుందని తెలిసినా సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం ట్విటర్ వేదికగా పలు విమర్శలు, వ్యంగోక్తులు చేశారు. ‘పోలవరం, సీఆర్‌డీయే రివ్యూలు చేస్తే కమిషన్లు వస్తాయని, తుపాను, తాగునీటి మీద రివ్యూ చేస్తే ఏం వస్తాయని చంద్రబాబు అనుకున్నట్టుంది... అంతేగా..అంతేగా’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే టీడీపీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘త్వరలో నేను జైలుకెళ్లటం ఖాయం అని చంద్రబాబు తయారు చేసిన అవినీతి శాఖ మంత్రి అన్నాడట!. వచ్చే ఏడాది ఆయనను, చంద్రబాబును, లోకేశ్‌ను పరామర్శించటానికి నేను ఎలాగూ వారంతా ఉన్న జైలుకు వెళ్ళాలి కదా!’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ను తెగతిన్న మంత్రి ఒకరు ఈమధ్యే బేరియాట్రిక్(బలుపును కోసి తీసేసే) సర్జరీ చేయించుకోవాలని వెళ్ళారట. అందుకే ఆయన ట్వీట్‌లలో కూడా కనిపించటం లేదట! ఇంతకీ ఆయన ఎవరో మీకెవరికైనా తెలిస్తే చెబుదురూ! ... అంటూ వ్యంగంగా మరో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు వచ్చే అయిదేళ్లలో 4.79 లక్షల కోట్లుంటుందని చంద్రబాబుగారి పత్రికలో రాశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే సామాజిక ఆర్థిక మంత్రి’ అయిన కుటుంబరావును అడగాలా? లేక ‘నామమాత్ర ఆర్థిక మంత్రి’ అయిన యనమలను అడగాలా?...అని ఆయన ప్రశ్నలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment