
ఎంపీ విజయసాయిరెడ్డి( పాత ఫోటో)
సాక్షి, తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటి వరకు రూ.3లక్షల కోట్ల నల్లదనాన్ని విదేశాలకు తరలించారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దేవుని డబ్బు సైతం తండ్రి కొడుకులు కలిసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబు, లోకేశ్‌లు జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.
అబద్ధాలు చెప్పి బాబు అధికారంలోకి వచ్చారని, మరోసారి చంద్రబాబును ప్రజలు నమ్మబోరని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం చంద్రబాబుతో సాధ్యం కాదన్నారు. అది వైఎస్‌ఆర్ కల అని, తమ ప్రభుత్వం ఏర్పడితే పోలవరాన్ని నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.