సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళనతో గురువారం లోక్‌సభ హోరెత్తింది. హోదా, విభజన హామీల అమలును పట్టుబడుతూ ఎంపీల ఆందోళనతో సభ అట్టుడికింది. ఎంపీల ఆందోళనతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ధర్నాకు దిగారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచీ పోరాడుతున్నది వైఎస్‌ఆర్‌సీపీనేనని తాము హోదా గురించి మాట్లాడితే చంద్రబాబు హేళన చేశారని ఎంపీలు పేర్కొన్నారు.
చంద్రబాబుకు స్వార్ధం తప్ప రాష్ర్ట ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. హోదా అంటే జైలుకే నంటూ బెదిరించడంతో పాటు హోదా ముగిసిన అథ్యాయమని అన్నారని గుర్తుచేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పోరాటంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. హోదా సాధించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంతవరకైనా వెళుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment