spl status for ap
-
ఉధృతంగా వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళనతో గురువారం లోక్‌సభ హోరెత్తింది. హోదా, విభజన హామీల అమలును పట్టుబడుతూ ఎంపీల ఆందోళనతో సభ అట్టుడికింది. ఎంపీల ఆందోళనతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీలు ధర్నాకు దిగారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచీ పోరాడుతున్నది వైఎస్ఆర్సీపీనేనని తాము హోదా గురించి మాట్లాడితే చంద్రబాబు హేళన చేశారని ఎంపీలు పేర్కొన్నారు. చంద్రబాబుకు స్వార్ధం తప్ప రాష్ర్ట ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. హోదా అంటే జైలుకే నంటూ బెదిరించడంతో పాటు హోదా ముగిసిన అథ్యాయమని అన్నారని గుర్తుచేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పోరాటంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. హోదా సాధించేందుకు వైఎస్ఆర్సీపీ ఎంతవరకైనా వెళుతుందని స్పష్టం చేశారు. -
బాబు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలి: కన్నబాబు
కాకినాడ : ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలపక్షాన్ని తక్షణమే ఢిల్లీ తీసుకు వెళ్లాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడలో ప్రత్యేక హోదాపకై సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కన్నబాబు మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో విభజన చట్టంలోని హామీలు ఏ మేరకు అమలు చేశారని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కన్నబాబు కోరారు. -
సీఎం ఏది చెబితే అదే తుది నిర్ణయం : చినరాజప్ప
విజయవాడ : సీఎం చంద్రబాబు ఏది చెబితే అదే తుది నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు. మీరు చెప్పినంత మాత్రాన బీజేపీతో పొత్తు ఉపసంహరించుకునే పరిస్థితి తేలదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు. ప్రత్యేక హోదా కోసం బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు. నేరాలకు పాల్పడే వారు సినిమాలు చూసి ఆ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో కానిస్టేబుల్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ట్రైనింగ్‌లో శిక్షణ కల్పిస్తామని చినరాజప్ప చెప్పారు.