
హోర్టోలాండియా : 245 మంది నడుంబిగించారు. తమను తాము తాళ్లతో కట్టుకున్నారు. ప్రపంచ రికార్డు నెలకొల్పుదామనే స్థిరమైన ఆలోచన తప్ప మరొకటి వారి మెదడులోకి రావడం లేదు. ఒక్కసారిగా 30 మీటర్ల ఎత్తైన బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకారు.
నీటిని తాకుతారమో అన్నంత దగ్గరలో పెండలంలా ఊగుతూ ఫీట్‌ను విజయవంతంగా చేశారు. ఈ అద్భుత దృశ్యం జరిగింది బ్రెజిల్‌లోని హోర్టోలాండియాలో. గిన్నిస్ రికార్డ్స్ దీన్ని అధికారికంగా గుర్తించాల్సివుంది. గతంలో 149 మంది కలసి ఇలాంటి ఫీట్‌ను చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.
గిన్నిస్ రికార్డ్ కోసం ఎత్తైన బ్రిడ్జి మీద నుంచి దూకేశారు