
పట్నా: క్వారంటైన్ సెంటర్లో ఓ వ్యక్తి డ్యాన్స్ ఇరగదీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. బిహార్ కతిహార్‌లోని క్వారంటైన్ సెంటర్‌లో తోటి వారిని ఉత్సాహపర్చడానికి ఒక వ్యక్తి 1967 నాటి ‘పడోసాన్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఏక్ చతుర్ నార్’ పాటకు డ్యాన్స్ చేశాడు. బనీను, ధోతి ధరించి మెహమూద్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ చేశాడు. క్వారంటైన్ సెంటర్‌లోని జనాలు చప్పట్లు కొడతూ అతడిని ఉత్సాహపరిచారు. అతడి ప్రయత్నం విజయవంతం అయ్యింది. నెటిపజనులు అతడి డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. సూపర్ భయ్యా అంటూ ప్రశంసిస్తున్నారు. ఆర్డీ బర్మన్ స్వరపరిచిన ‘ఏక్ చతుర్ నార్’ పాటను కిషోర్ కుమార్, మన్నా డే, మెహమూద్ పాడారు.