
గువహటి : క్వారంటైన్ సెంటర్‌లో రోజులకు రోజులు నాలుగు గోడల మధ్య ఖాళీగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. దీంతో బోరింగ్‌గా ఫీల్ అయ్యేవాళ్లు ఉంటారు. కానీ బయటికి వెళ్లలేని పరిస్థితి. దీంతో క్వారంటైన్ సెంటర్‌లో డ్యాన్సులేస్తూ ఉల్లాసంగా గడిపారు కరోనా పేషెంట్లు. వారి ప్రతిభను చూపిస్తూ చక్కగా అసలు కరోనా సోకిందన్న విషయమే మర్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ అవుతోంది. ఈ ఘటన అసోం రాష్ర్టం డిబ్రుఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. పిల్లనగ్రోవితో పాటలు పాడుతుంటే మరికొందరు దానికి అనుగుణంగా డ్యాన్యులు చేస్తూ ఎంజాయ్ చేశారు. కరోనా మనసిక ఒత్తిడిని జయించేందుకు వారు ఈ విధంగా సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
#WATCH Coronavirus patients dance and sing at a quarantine centre in Dibrugarh, Assam. (23.07.20) pic.twitter.com/SBjtIrSdks
— ANI (@ANI) July 24, 2020
Comments
Please login to add a commentAdd a comment