గువాహటి : దేశంలో కరోనా విజృంభిస్తుంది. అంతే స్థాయిలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. భారత్‌లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఈ నేపధ్యంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారికి అస్సాం ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్ సమయాన్ని 7 రోజులకు తగ్గిస్తూ అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 14 రోజులకు ఉన్న హోం క్వారంటైన్ గడువును ఏడు రోజులకు కుదించింది. (ఇక రూ.400 లకే కరోనా పరీక్షలు! )
డిశ్చార్జ్ అయిన వారికి ప్రభుత్వం ఇప్పటిదాకా అందిస్తూ వచ్చిన రెండువేల విలువైన అత్యవసర వస్తు పంపిణీని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిరుపేదలు, బీపీఎల్ కింద నివసిస్తున్న కుటుంబాలు, వృద్ధులు దివ్యాంగులకు మాత్రం తాజా ఉత్తర్వులు వర్తించవని, వారికి మునుపటి మాదిరిగానే పథకం అమలవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనల్ని సడలిస్తూ జూలై 19న ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులసంఖ్య 29,921కు చేరుకుంది. (కరోనా రోగులపై చార్జీల బాదుడు: షాక్)
Comments
Please login to add a commentAdd a comment