
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం ట్విటర్‌లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్(#SareeTwitter) కింద ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చీరతో ఉన్న తమ ఫొటోలను ట్విట్ చేస్తూ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. దీంతో శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. కాగా, ఈ హ్యాష్‌ట్యాగ్‌తో కూడిన ఓ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చీర ధరించన ఓ యువతి క్రికెట్ మైదానంలో పరుగెత్తి తన అభిమాన క్రికెటర్‌కు ముద్దు పెట్టారు. ఈ సంఘటన 1975లో జరగ్గా.. శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్ పుణ్యమా అని ఇప్పుడు వైరల్ అయింది.
అసలు ఏం జరిగిందంటే..1975లో వెస్టిండీస్, ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్రికెటర్ బ్రిజేష్ పటేల్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. దీంతో ఓ భారత అభిమాని మైదానంలోకి పరిగెత్తి అతడికి ముద్దు పెట్టారు. నల్లటి చీర(బ్లాక్ అండ్ వైట్ వీడియోలో కనిపించిన రంగు)లో ఉన్న యువతి పోలీసులు, గ్రౌండ్ సిబ్బందికి చిక్కకుండా పటేల్ వద్దకెళ్లి అతడి బుగ్గ మీద కిస్ చేశారు.
చీరలో ఉన్నా కూడా పోలీసులకు చిక్కకుండా స్పీడ్‌గా పరుగెత్తి తన అభిమాన క్రికెటర్‌కు ముద్దు పెట్టారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి.. ఆ వీడియో వైరల్ కాలేదు. అయితే శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్ పుణ్యమా అని ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. ఇక నెటిజన్లు ఈ ట్వీట్‌పై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. శారీ ట్విటర్ హాష్‌ట్యాగ్‌తో పోస్టుచేసిన ఫొటోలు, వీడియోల్లో ఇదే అత్యుత్తమైన ట్వీట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ‘నాకు చీరలోనడవడమే కష్టం కానీ ఆమె ఏకంగా పరుగెత్తారు. ఇది బెస్ట్ పోస్ట్.’, ‘చీరలో ఓ మహిళ పెరుగెత్తి అథ్లెటిజంలో కొత్త ఒరవడి సృష్టించారు. ‘వావ్.. చీరలో ఇంత స్పీడ్‌గా ఎవరు పరుగెత్తలేరు’ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.