వర్షం కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు.
హైదరాబాద్: వర్షం కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. రాత్రి 10.40 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది.
అంతకుముందు ఉప్పల్ లో భారీ వర్షం కురవడంతో మైదానం నీళ్లతో నిండిపోయింది. వర్షం చాలాసేపు కురవడంతో మ్యాచ్ బాగా ఆలస్యమైంది. మ్యాచ్ జరగదేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే వర్షం తగ్గడంతో మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు.