
సైనా, కశ్యప్‌లకు రూ. 5 లక్షల నజరానా
అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల చొప్పున నగదు పురస్కారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల చొప్పున నగదు పురస్కారం ప్రకటించింది. ఇటీవల సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. సైనాతోపాటు కశ్యప్ జనవరిలో జరిగిన సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో విజేతలుగా నిలిచారు.
‘అంతర్జాతీయ వేదికపై అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం మా విధానం. వారి ప్రదర్శనతో దేశానికి కూడా పేరు వస్తోంది’ అని ‘బాయ్' అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా తెలిపారు. స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన భారత ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు కూడా ‘బాయ్’ సోమవారం రూ. 5 లక్షల నజరానా ప్రకటించింది.