కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ విజయం దిశగా సాగుతోంది.
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ విజయం దిశగా సాగుతోంది. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ)తో రేవా జిల్లాలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో బుధవారం ఆటముగిసే సమయానికి హైదరాబాద్ 78 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులు చేసింది. పి. సారుు వికాస్ రెడ్డి (83) ఆకట్టుకున్నాడు. మికెల్ జైశ్వాల్ (22 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో రితేశ్ 3 వికెట్లు దక్కించుకున్నాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 159/7తో మూడోరోజు రెండో ఇన్నింగ్‌సను కొనసాగించిన ఎంపీసీఏ 71.1 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్‌స ఆధిక్యం 78 పరుగులు కలిపి మొత్తం 265 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ముందుంచింది. ప్రస్తుతం హైదరాబాద్ విజయం కోసం మరో 73 పరుగులు చేయాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నారుు. తొలి ఇన్నింగ్‌సలో మధ్యప్రదేశ్ 245 పరుగులకు అలౌటవ్వగా... హైదరాబాద్ 186 పరుగులు చేసింది.