హైదరాబాద్, జార్ఖండ్ మ్యాచ్ డ్రా | match between hyderaba and jharkhand drawn | Sakshi
Sakshi News home page

హైదరాబాద్, జార్ఖండ్ మ్యాచ్ డ్రా

Published Fri, Nov 18 2016 11:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

match between hyderaba and jharkhand drawn

 కూచ్ బెహర్ క్రికెట్ టోర్నీ

 సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా గా ముగించింది. 402 పరుగుల లక్ష్య ఛేదనలో... 55/0 ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు రెండో ఇన్నింగ్‌‌సను కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 132 ఓవర్లలో 7 వికెట్లకు 297 పరుగులతో నిలిచింది. నితీశ్ రెడ్డి (63), సారుు వికాస్ రెడ్డి (78) అర్ధసెంచరీలు చేయగా... భగత్ వర్మ (37 నాటౌట్) రాణించాడు.

 

జార్ఖండ్ బౌలర్లలో వినాయక్ విక్రమ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో  జార్ఖండ్ తొలి ఇన్నింగ్‌‌సలో 194 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్‌‌సను 350 /6 వద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌‌సలో 143 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం కారణంగా జార్ఖండ్‌కు 3 పాయింట్లు లభించగా, హైదరాబాద్‌కు 1 పాయింట్ దక్కింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement