సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ ఆర్చరీ పోటీల్లో (అండర్-17) ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు రెండో స్థానం సొంతం చేసుకుంది. ఇండియన్ రౌండ్ టీమ్ విభాగంలో ఏపీ ఓవరాల్‌గా 1675 పాయింట్లు స్కోర్ చేసింది. ఎస్. హేమని, సుష్మ, డి. పావని, డి. సువర్ణ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఇదే ఈవెంట్‌లో జార్ఖండ్ (1796) మొదటి స్థానంలో నిలవగా, పంజాబ్ (1666)కు మూడో స్థానం దక్కింది. అండర్-17 బాలుర విభాగంలో జార్ఖండ్ (1918 పాయింట్లు) మొదటి స్థానంలో నిలిచింది.
గుజరాత్ (1841), హర్యానా (1839) ఆ తర్వాతి స్థానాలు అందుకున్నాయి. అండర్-17 బాలికల వ్యక్తిగత విభాగంలో అంకిత భక్త్ (బెంగాల్-619 పాయింట్లు) తొలి స్థానం అందుకోగా, భారతి మహతో (జార్ఖండ్-608) రెండు, సింపీ కుమారి (జార్ఖండ్-606) మూడో స్థానాల్లో నిలిచారు. అండర్-17 బాలుర వ్యక్తిగత విభాగంలో కరణ్ హన్సా (జార్ఖండ్-651 పాయింట్లు) విజేతగా నిలిచాడు. శివకుమార్ (జార్ఖండ్-651), జగదీశ్ చౌదరి (రాజస్థాన్-647)లు రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు.
ఏపీ బాలికల జట్టుకు రెండో స్థానం
Published Wed, Jan 22 2014 12:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement