బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆదిత్య జోషి సంచలనం | Aditya Joshi becomes India's first World No 1 junior badminton player | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆదిత్య జోషి సంచలనం

Published Tue, Jan 7 2014 4:55 PM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM

బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆదిత్య జోషి సంచలనం

బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆదిత్య జోషి సంచలనం

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ఆదిత్య జోషి సంచలనం సృష్టించాడు.  జూనియర్‌ బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సొంతం చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు ఆదిత్య. గతేడాది నవంబర్‌లో 11వ స్థానంలో ఉన్న ఆదిత్య.. జనవరిలో ఏకంగా పది స్థానాలు ఎగబాకడం విశేషం. 2001లో ఐదేళ్ల వయసులో బ్యాడ్మింటన్‌ ఆడటం మొదలుపెట్టిన ఆదిత్య.. అప్పటి నుంచే సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టాడు. 2011లో రష్యాలో జరిగిన జూనియర్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో గోల్డ్‌మెడల్‌ సాధించాడు.

 

గతేడాది జూనియర్‌ వాల్డ్‌ చాంపియన్‌షిప్‌తో పాటు ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్‌ వరకూ వచ్చాడు. గతేడాది నేషనల్‌ చాంపియన్‌ అయిన ఆదిత్య.. పుణెలో జరిగిన జూనియర్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో రెండు గోల్డ్‌ మెడల్స్‌ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement