బంగ్లాదేశ్‌కు అఫ్ఘానిస్తాన్ షాక్ | Afghanistan win in the second ODI against Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌కు అఫ్ఘానిస్తాన్ షాక్

Published Thu, Sep 29 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

బంగ్లాదేశ్‌కు అఫ్ఘానిస్తాన్ షాక్

బంగ్లాదేశ్‌కు అఫ్ఘానిస్తాన్ షాక్

 మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్ఘానిస్తాన్ సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్ఘాన్ 2 వికెట్ల తేడాతో బంగ్లాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. తొలి మ్యాచ్ ఆడుతున్న మొసద్దిక్ హుస్సేన్ (45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
 
  రషీద్ ఖాన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం అఫ్ఘానిస్తాన్  49.4 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగులు చేసింది. కెప్టెన్ అస్గర్ స్టానిక్‌జాయ్ (95 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ నబీ (61 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. షకీబ్ 4 వికెట్లు తీశాడు. మూడు వన్డేల సిరీస్ ఇరు జట్లు 1-1తో సమంగా నిలవగా చివరి మ్యాచ్ శనివారం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement